గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 19:09:40

కోవిడ్‌-19తో దేవ‌పూర్ ఫారెస్ట్ రేంజ్ ఎఫ్‌బీవో మృతి

కోవిడ్‌-19తో దేవ‌పూర్ ఫారెస్ట్ రేంజ్ ఎఫ్‌బీవో మృతి

మంచిర్యాల : మ‌ంచిర్యాల అట‌వీ డివిజ‌న్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసే వ్య‌క్తి కోవిడ్‌-19తో బుధ‌వారం మృతిచెందాడు. సంతోష్ మండ‌ల్‌(55) దేవ‌పూర్ ఫారెస్ట్ రేంజ్‌లో ఎఫ్‌బీవోగా ప‌నిచేస్తున్నాడు. క‌రోనా భారిన ప‌డ‌టంతో క‌రీంన‌గ‌ర్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో చ‌నిపోయాడు. ఇటీవ‌లే ఇత‌ను కోవిడ్ భారిన ప‌డ్డాడు. మృతుడికి భార్య‌, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 20 ఏల్ల క్రితం అట‌వీశాఖ‌లో చేరాడు.  మంచిర్యాల డివిజ‌న్‌లో 10 మంది దేవ‌పూర్ డివిజ‌న్‌లో ఏడుగురు అట‌వీ అధికారులు క‌రోనా భారిన ప‌డ్డ‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఫారెస్ట్ డివిజ‌న‌ల్ ఆఫీస‌ర్ విన‌య్ కుమార్ సాహుకు కూడా క‌రోనా సోకింది.


logo