శనివారం 11 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 10:44:33

మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో గన్‌తో వ్యక్తి హల్‌చల్‌

మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో గన్‌తో వ్యక్తి హల్‌చల్‌

హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి గన్‌తో హల్‌చల్‌ చేశాడు. గడిచిన రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి స్కార్పియో ఎస్‌యూవీ వాహనంలో వచ్చి మస్తాన్‌నగర్‌ ప్రాంతంలో కారును వేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. అనుమానంగా తిరుగుతుండటంతో వాహనం రివర్స్‌ చేసుకునే సమయంలో స్థానికులు కొందరు అతడ్ని ప్రశ్నించేందుకు వెళ్లారు.

సదరు వ్యక్తి కారులోంచి చేతిలో గన్‌తో దిగేసరికి స్థానికులు భయంతో వెనక్కి వెళ్లారు. దీంతో కారును అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలన నిమిత్తం సీసీ కెమెరాలో రికాైర్డెన ఫుటేజీని తీసుకున్నారు. ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.


logo