శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 08:52:55

వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన దుండగులు

వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన దుండగులు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యాకూబ్‌ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కర్రలతో కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన మణుగూరు మండలం గుట్టమల్లారంలో గురువారం చోటు చేసుకుంది. యాకూబ్‌ పాషా (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి బ్రహ్మంగారి గుట్ట సమీపంలో కర్రతో కొట్టి చంపారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు. మణుగూరు ఎస్‌ఐ నగేశ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్‌ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.