ఎవరైనా హీరోకు వరుస ప్లాపులు వస్తే కచ్చితంగా మార్కెట్ దెబ్బతింటుంది. అందులోనూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలకు ప్రతి సినిమాతో హిట్ కొట్టడం చాలా అవసరం. విజయ్ దేవరకొండ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కెరీర్ మొదట్లో వరుస విజయాలు అందుకొన్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా, మహానటి లాంటి సంచలన విజయాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. వాటితో మార్కెట్ కూడా బాగానే పెరిగిపోయింది. రెండేళ్ల కింద 40 కోట్లకు పైగా మార్కెట్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ దాదాపు 40 కోట్లకు పైగా బిజినెస్ చేసి డిజాస్టర్ గా నిలిచింది.
ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచింది. ఈ రెండు ఫ్లాపులతో విజయ్ మార్కెట్ పడిపోతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ తన మార్కెట్ స్ట్రాటజీతో ఇమేజ్ ఏమాత్రం పడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు విజయ్. ఇంకా చెప్పాలంటే జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం యూత్ లో విజయ్ దేవరకొండ అంటే ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి, ఖుషి వంటి సినిమాల సమయంలో పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉండేదో.. ఇప్పుడు విజయ్ ను చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది. సినిమాల కంటే కూడా బయట సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటారు విజయ్ దేవరకొండ.
సినిమాను మించిన ఇమేజ్ సంపాదించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. అందుకే వరుస పరాజయాలు వస్తున్నా కూడా అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో నటిస్తున్నాడు విజయ్. ఆ తర్వాత సుకుమార్, కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులు ఈ కుర్రహీరో కోసం కథను సిద్ధం చేస్తున్నారు. అన్నింటికీ మించి హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మెన్ గా నిలిచాడు విజయ్ దేవరకొండ. తనను తాను ప్రమోట్ చేసుకోవడం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఎప్పుడూ తన పేరు మార్కెట్లో వినిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే విజయ్ ను ప్రమోషనల్ కింగ్ అంటారు.
ఇవి కూడా చదవండి..
త్రివిక్రమ్ మ్యాజిక్ ‘అ..ఆ’కు ఐదేళ్ళు..ఫైనల్ కలెక్షన్స్ !
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి