మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 17:40:18

ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో మాజీ మంత్రి పీఏ గల్లంతు

ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో మాజీ మంత్రి పీఏ గల్లంతు

ఖమ్మం : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఖమ్మం నగరం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. గల్లంతైన వ్యక్తి మాజీ మంత్రి రేణుకా చౌదరి పీఏ నున్న రవిగా సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి బుధవారం ఉదయం స్నేహితులతో కలిసి కరుణగిరి ప్రాంతంలోని కాలువకు ఈతకు వెళ్లాడు. కాగా ఉన్నట్లుండి రవి ఒక్కసారిగా నీటిలో గల్లంతయ్యాడు. ప్రత్యక్షసాక్షి, రవికి ఈత నేర్పిన వ్యక్తి సీహెచ్‌ వెంకటేశ్వర్‌ రావు మాట్లాడుతూ.. రవి గుండెపోటుకు గురైఉండొచ్చని అందువల్లే నీటి సుడుల్లో చిక్కి గల్లంతైనట్లుగా అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

VIDEOS

logo