సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 21:39:57

గోదావరిలో వ్యక్తి గల్లంతు..

గోదావరిలో వ్యక్తి గల్లంతు..

ధర్మపురి : బంధువు దశదిన కర్మకు వచ్చి గోదావరిలో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతయ్యాడు. ధర్మపురి మండలం జైన గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దుబ్బలగూడెం గ్రామానికి చెందిన పెరుమాళ్ల భీమరాజు (37) ఉదయం జైన గ్రామంలో తన బంధువు దశదిన కర్మకు వెళ్లాడు.  క్రతువు పూర్తయ్యాక సాయంత్రం బంధువులతో కలిసి స్నానం చేసేందుకు శివారులో గోదావరి నదికి వెళ్లాడు. స్నానం చేస్తుండగా ప్రవాహ ఉధృతిలో గల్లంతయ్యాడు. బంధువులు, స్థానికులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ ధర్మపురి నుంచి గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. ఇంతవరకు మృతదేహం లభించలేదు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.