శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 15:40:46

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. వ్యక్తి మృతి

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని మిడ్జిల్‌ మండలం మున్ననూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని వల్లబురావుపల్లికి చెందిన రమేష్‌గా గుర్తించారు. గాయపడ్డవారిని ఇదే గ్రామానికి చెందిన యాదయ్య, కృష్ణయ్యగా సమాచారం. మిడ్జిల్‌లో ఓ పెళ్లిలో బ్యాండ్‌ వాయించడానికి వచ్చిన వీరు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు.

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం...

డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గద్వాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు ఇడిక్యాలపాడు స్టేజ్‌ వద్ద అదుపుతప్పి డివైడైర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా ప్రయాణికులు తెలుపుతున్నారు. టేప్‌రికార్డ్‌ను సరిచేస్తుండగా బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలుకాలేదు.


logo