బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 07:50:48

ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని...

ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని...

హైదరాబాద్ :ప్రియురాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో....జీవితంపై విరక్తి తో ప్రియుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్‌ రైల్వే పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఈస్ట్‌మారేడ్‌పల్లి వడ్డెరబస్తీకి చెందిన తంగెళ్లపల్లి బాలకృష్ణ(19) ప్రైవేటు ఉద్యోగి. దూల్‌పేట కు చెందిన ఓ యువతిని కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. కాగా ఈనెల 11న ప్రియురాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న బాలకృష్ణ తల్లిదండ్రులకు చెప్పి ఏడ్చాడు. దీంతో కుటుంబసభ్యులు బాలకృష్ణను సముదాయించారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలకృష్ణ 13న డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.

మృతుడికి తల్లి ఫోన్‌ చేసి ఎక్కడున్నావని అడుగగా...మియపూర్‌లో ఉన్నానని కొంచెం లేటవుతుందని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. రాత్రి సుమారు 11గంటల సమయంలో బాలకృష్ణ జేమ్‌స్ట్రీట్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


logo