గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 22:01:57

హైవేపై దగ్గుతూ కనిపించాడు...

హైవేపై దగ్గుతూ కనిపించాడు...

మెదక్ జిల్లా: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో..పోలీసులు ఎక్కడికక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు మెదక్ జిల్లాలోని చేగుంట మండలం  వడియారం బైపాస్ వద్ద దగ్గుతో కనిపించాడు. కరోనా అనుమానితుడిగా భావించిన పోలీసులు రామాయంపేట సీఐ ఆధ్వర్యంలో అతన్ని ఆసుపత్రికి తరలించారు.

సదరు వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రవి సింగ్ కాగా..అతడు ఓ కంపెనీ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నవెంటనే ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేగుంటకు చేరుకుని ఆ వ్యక్తి గురించి వివరాలు అడిగి తెలుసుకుని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు నిర్దేశించారు. 


logo
>>>>>>