శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 09:36:16

వికారాబాద్‌ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

వికారాబాద్‌ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

వికారాబాద్‌ : జిల్లాలోని రాంపూర్‌ గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సతీశ్‌ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి శుక్రవారం రాత్రి గొడ్డలి వెంబడించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం కరిగేట్‌ పొలంలో శవాన్ని పడేసి, కరణ్‌కోట్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా, హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇద్దరి మధ్య ఏవైనా కక్షలు ఉన్నాయనా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పండుగ పూట సతీశ్‌ హత్యకు గురవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.