బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 12, 2020 , 01:14:18

100కు ఫోన్‌.. ప్రాణం సేఫ్‌

100కు ఫోన్‌.. ప్రాణం సేఫ్‌

రామాయంపేట : ఆర్థిక సమస్యలతో రోడ్డు పక్కన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని  పోలీసులు కాపాడారు. మెదక్‌ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లికి చెందిన లారీ డ్రైవర్‌ అనిల్‌ మంగళవారం బైపాస్‌ రోడ్డు పక్కన ఓ చెట్టుపైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించగా అటువైపు వెళ్తే వారు గుర్తించి 100 నంబర్‌కు డయల్‌ చేశారు. నిమిషాల వ్యవధిలో వచ్చిన పోలీసులు అతడిని కాపాడారు. ఆ వెంటనే 108 వాహనంలో దవాఖానకు తరలించారు. నిమిషాల వ్యవధిలో స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.


logo