శనివారం 30 మే 2020
Telangana - May 03, 2020 , 14:44:54

కూతురిని పుట్టింటికి పంపలేదని వియ్యంకుడిపై దాడి

కూతురిని పుట్టింటికి పంపలేదని వియ్యంకుడిపై దాడి

నిజామాబాద్‌: జిల్లాలోని కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన వియ్యంకుడిపై రాజం అనే వ్యక్తి కర్రతో దాడి చేయడంతో రాములు తీవ్రంగా గాయపడ్డాడు.సంఘటన వివరాల్లోకి వెలితే రాజం తన కూతురిని హసకొత్తూరులోని రాములు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే రాజం తన కూతురుని పుట్టింటికి తీసుకెళ్లడానికి వచ్చారు. కరోనా కారణంగా తన కోడలిని పుట్టింటికి పంపడానికి రాములు నిరాకరించాడు. తన కూతురిని ఎందుకు పంపవంటూ ఆగ్రహంతో ఊగిపోయిన రాజం కర్రతో రాములుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాములును కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాములు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజంను అదుపులోకి తీసుకున్నారు. 


logo