గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 20:32:26

పేలుడు పదార్థాలు నిల్వ చేసిన వ్యక్తి అరెస్టు

పేలుడు పదార్థాలు నిల్వ చేసిన వ్యక్తి అరెస్టు

వరంగల్‌ : అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన పేలుడు పదార్ధాలను ఆదివారం ట్రాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుభేదారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన ముక్కల దేవదాస్‌ ఇంట్లో అక్రమంగా నిషేధిత పేలుడు పదార్థాలు నిల్వ చేశాడని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడి ఇంటిపై దాడి చేసి 239 డిటోనేటర్లు, 35 జిలెటిన్ స్టిక్స్, 35 కిలోల అమ్మోనియం నైట్రేట్, 256 మీటర్ల సేఫ్టీ ఫ్యూజ్‌ వైర్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

దేవదాస్‌ విచారించగా హనుమకొండ దుర్గా కాలనీకి చెందిన రాజు వద్ద పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకొని క్వారీలో బండలు పగులగొట్టేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు వెల్లడించాడు. స్వాధీనం చేసుకున్న పేలుడు సామగ్రితోపాటు నిందితుడు దేవదాసును సుబేదారీ ఎస్‌ఐకి అప్పగించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.