శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 26, 2020 , 01:06:55

ఆన్‌లైన్‌లో కల్తీ మద్యం

ఆన్‌లైన్‌లో కల్తీ మద్యం
  • మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుంటూ.. కల్తీవైన్‌ను విక్రయిస్తున్న మోసగాడిని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది, సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సిబ్బంది అరెస్టు చేశారు. ద్రాక్షరసం, కొద్దిగా చక్కెర, కొన్ని నీళ్లు కలిపి పులియబెట్టి దాన్నే వైన్‌గా ఖరీదైన సీసాల్లో నింపి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వినియోగదారులను నమ్మించి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుంటూ అమెజాన్‌ ద్వారా డెలివరీ చేస్తున్నట్టు నిర్ధారించుకున్నారు. ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పవన్‌కుమార్‌ నేతృత్వంలో బృందం రంగంలోకి దిగింది. సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధి కొత్తపేట సరస్వతినగర్‌ కాలనీలోని మహేశ్వ రం శివప్రసాద్‌ ఇంటిపై దాడిచేసింది. సోదా ల్లో 20 లీటర్ల ద్రాక్షరసం, 60 కల్తీవైన్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నది. ఆన్‌లైన్‌లో మార్కెట్‌ చేస్తూ.. ఇన్‌స్టాగ్రాం, వాట్సప్‌ ద్వారా ఆర్డర్లు తెప్పించుకుని బాటిళ్లను అమెజాన్‌లో పంపుతున్నట్టు నిందితుడు అంగీకరించాడు. 


logo