ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 01:04:51

టీఎన్జీవో అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్‌

టీఎన్జీవో అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/సుల్తాన్‌బజార్‌: టీఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కారం రవీందర్‌రెడ్డి పదవీవిరమణ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజేందర్‌ను నూతన అధ్యక్షుడిగా నిమించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా రాజేందర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల సూచనమేరకు భవిష్యత్‌ కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు తోటి ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో ఉద్యోగుల హక్కుల సాధనకు కృషిచేస్తానని చెప్పారు. మామిళ్ల రాజేందర్‌ ప్రస్తుతం ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు. 

అధ్యక్షుడిగా పనిచేయడం అదృష్టం: కారం రవీందర్‌రెడ్డి

టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం అభించడం అదృష్టంగా భావిస్తున్నానని కారం రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దకాలంగా కేంద్ర సంఘం కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేసి తెలంగాణ ఉద్యమంతోపాటు ఉద్యోగుల హక్కుల సాధన కోసం కృషిచేయడం, 43శాతం ఫిట్‌మెంట్‌ సాధించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్‌ అధ్యక్షురాలు బండారు రేచల్‌, కోశాధికారి రామినేని శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎం ముజీబ్‌హుస్సేన్‌, నగరశాఖ అధ్యక్షుడు ఆర్‌ ప్రతాప్‌, కార్యనిర్వాహక కార్యదర్శి కొండల్‌రెడ్డి, శ్యాంసుందర్‌, స్వామి, నరసింహాచారి, ఉమాదేవి, తిరుమల్‌రెడ్డి, రాము, లక్ష్మణ్‌రావు, రవి, దివ్య, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo