శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 17:30:20

ముగిసిన గుండా మల్లేశ్‌ అంత్యక్రియలు

ముగిసిన గుండా మల్లేశ్‌ అంత్యక్రియలు

మంచిర్యాల ‌: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ మాజీ శాసనసభ పక్షనేత గుండా మల్లేశ్‌ అంత్యక్రియలు బుధవారం బెల్లంపల్లిలో ముగిశాయి. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. తొలుత కార్యకర్తల సందర్శనార్థం హైదరాబాద్‌లోని మగ్ధుం భవన్‌కు  తరలించారు. అక్కడి నుంచి నేరుగా బెల్లంపల్లి పట్టణానికి మంగళవారం రాత్రి తీసుకువచ్చారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన కడసారి చూపుకోసం భారీగా తరలివచ్చారు. పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ విదేశాల్లో ఉండడంతో మనవడితో అంత్యక్రియలు జరిపించారు.