ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 00:24:00

ప్రజలు తిరస్కరించినా మారరా!

ప్రజలు తిరస్కరించినా మారరా!

  • విమర్శించడం విపక్షాలకు ఫ్యాషనైంది
  • నా వ్యాఖ్యలు వక్రీకరించారు : మంత్రి మల్లారెడ్డి  

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ప్రభుత్వం ఏ కార్యక్రమం చే పట్టినా విమర్శించడం విపక్షాలకు ఫ్యాషన్‌గా మా రిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండ గా నిలవాల్సిందిపోయి.. విపక్షాలు అనవసర విమర్శలకు దిగుతున్నాయన్నారు. చెట్లు పర్యావరణానికి అవసరమైన ఆక్సిజన్‌ అందిస్తాయని, భూతాపాన్ని , కాలుష్యాన్ని తగ్గిస్తాయని, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయని తా ను చేసిన వ్యాఖ్యలను కొందరు ఇష్టమొచ్చినట్టుగా అన్వయించుకొని వక్రీకరించడం సరికాదన్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రజలు తిరస్కరించినా విపక్షాలు మారకపోవడంం దురదృష్టకరమన్నారు. కరోనా నిర్ధారణకు నాచారంలోని ఈఎస్‌ ఐ వైద్యశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్న మంత్రి మల్లారెడ్డి.. పాజిటివ్‌ రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేశామని స్పష్టంచేశారు.


logo