సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 15:57:43

మల్లారెడ్డి వర్సిటీ లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

మల్లారెడ్డి వర్సిటీ లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ : మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు ఆవిష్కరించారు. మేడ్చల్‌ మైసమ్మగూడలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, ఎమ్మెల్యేలు వివేకానంద, జీవన్‌రెడ్డి, ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్‌ రెడ్డి, గోపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, డాక్టర్‌ భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో ఐదు ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే. 1. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్భుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో మహింద్రా యూనివర్సిటీ, 2. మెదక్‌ జిల్లా సదాశివ్‌పేట మండలం కంకోల్‌లో వోక్సెన్‌ యూనివర్సిటీ, 3. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దూళపల్లి ఏరియా  మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, 4. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ, 5. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లో అనురాగ్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.


logo