మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:33

ఈఎస్‌ఐ దవాఖానల్లో కరోనా చికిత్స

ఈఎస్‌ఐ దవాఖానల్లో కరోనా చికిత్స

  • కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈఎస్‌ఐ దవాఖానల్లో కొవిడ్‌ రోగులకు వైద్య చికిత్స కోసం సత్వరమే ఏర్పాట్లుచేయాలని కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. అన్నిరకాల అత్యవసర మందులను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో కార్మిక, ఉపాధికల్పన, నైపుణ్యాభివృద్ధి, ఈఎస్‌ఐశాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. కిడ్నీ, క్యాన్సర్‌ బాధితుల కోసం ప్రత్యేక క్యాంప్‌ను ఏర్పాటుచేసి, వారికి కిట్లు అందజేయాలని మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. కార్మికశాఖలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని చెప్పారు. విద్యార్థుల ఉపాధి అవకాశాల కోసం కొత్త ట్రేడ్‌లను ప్రారంభించాలన్నారు.


logo