ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 03:51:58

ఘనంగా మంత్రి మల్లారెడ్డి బర్త్‌ డే

ఘనంగా మంత్రి మల్లారెడ్డి బర్త్‌ డే

  • జవహర్‌నగర్‌లో సీఎంఆర్‌ దవాఖాన ప్రారంభం

జవహర్‌నగర్‌: కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పుట్టినరోజు వేడుకలను జవహర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా నిర్వహించారు. జవహర్‌నగర్‌లో సీఎంఆర్‌ దవాఖానను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈ టల రాజేందర్‌ ప్రారంభించారు. అనంతరం అంబులెన్స్‌ను ప్రారంభించి మొక్కలు నాటారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రులు 2,500 మందికి చీరెలు పంపిణీచేశారు.  కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి,  టీఆర్‌ఎస్‌ మ ల్కాజిగిరి పార్లమెంట్‌ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మేడ్చల్‌ నియోజకవర్గ ఇంచార్జి చామకూర మహేందర్‌రెడ్డి, జవహర్‌నగర్‌ మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌, నాయకులు మేకల అయ్యప్ప, డాక్టర్‌ రాజశేఖర్‌,  కొం డల్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo