గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 21:26:45

వేములవాడను రెవెన్యూ డివిజన్‌ చేయడం హర్షనీయం: బోయినపల్లి వినోద్‌కుమార్‌

వేములవాడను రెవెన్యూ డివిజన్‌ చేయడం హర్షనీయం: బోయినపల్లి వినోద్‌కుమార్‌

వేములవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజన్న ఆలయం ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడను  కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయడం హర్షనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినోద్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడమే కాకుండా మిడ్ మానేరు నుంచి నీళ్లను అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని వినోద్‌కుమార్‌ తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo