శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 22:48:24

రెండు గంటల్లో లక్ష లడ్డూల తయారీ

రెండు గంటల్లో లక్ష లడ్డూల తయారీ

ఆలేరు : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు ఆధునాత లడ్డూ తయారీ యంత్రాన్ని తీసుకురాగా బుధవారం దాన్ని బిగించారు. గంటకు లక్ష లడ్డూలను తయారు చేసే యంత్రాన్ని ఆలయాధికారులు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రాబోయే రోజుల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. ఇప్పటికే యాదాద్రిలో రోజుకు 50 వేలకు పైగా లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. నూతనంగా నిర్మించిన యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభమైతే భక్తుల తాకిడికి అనుగుణంగా లడ్డూలను అందుబాటులో ఉండేందుకు నూతన యంత్రాన్ని వాడనున్నారు. ఈ యంత్రం ముంబయిలోని ప్రముఖ పరిశ్రమల్లో తయారీ చేయించారు.