శనివారం 06 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 15:52:45

అక్టోబర్‌ నాటికి బతుకమ్మ చీరల తయారీ: టెస్కో ఎండీ

అక్టోబర్‌ నాటికి బతుకమ్మ చీరల తయారీ: టెస్కో ఎండీ

హైదరాబాద్‌: హ్యాండ్లూమ్‌, పవర్‌లూం క్లాత్‌తో మాస్కులు తయారుచేస్తున్నామని టెస్కో ఎండీ శైలజ రామయ్యర్‌ ప్రకటించారు. ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా క్లాత్‌ మాస్కుల తయారీకి ఆర్డరిచ్చామని తెలిపారు. హైదరాబాద్‌లో వందకంటే ఎక్కువ మాస్కులు ఆర్డర్‌ చేసినవారికి డోర్‌ డెలివరీ చేస్తామని, సూపర్‌ మార్కెట్లలోనూ క్లాత్‌ మాస్కులు అందుబాబులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. 225 రకాలతో 90 లక్షల బతుకమ్మ చీరలు ఆర్డర్‌ ఇచ్చామని, ఇప్పటివరకు బతుకమ్మ చీరల ఉత్పత్తి 40 శాతం పూర్తయిందని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలిస్తే అక్టోబర్‌ వరకు చీరల తయారీ పూర్తవుతుందన్నారు. 

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి టెస్కోకు రూ.80 కోట్ల విలువైన యూనిఫాం ఆర్డర్‌ వచ్చిందని, ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల నుంచి రూ.70 కోట్ల ఆర్డర్‌ వచ్చిందని, లాక్‌డౌన్‌ సడలింపు ఉంటే రెండు, మూడు నెలల్లో విద్యార్థుల యూనిఫాం తయారు చేస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఉంటే చేనేత రంగం పనులు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.


logo