సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 15:15:06

గిరిజన విద్యలో రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలి : మంత్రి సత్యవతి

గిరిజన విద్యలో రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలి : మంత్రి సత్యవతి

మహబూబాబాద్‌ : సీఆర్టీలో చిత్తశుద్ధి పని చేసి గిరిజన విద్యలో రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా నిలుపాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పిలుపునిచ్చారు. గిరిజన విద్యాలయాల్లో 1950 మంది కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్‌ను రెన్యువల్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం నాయకులు గురువారం మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దారవత్ బాలాజీ, ఉపాధ్యక్షుడు వట్టం శంకర్ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సీఎం లక్ష్య సాధనలో అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం కేసీఆర్‌ సీఆర్టీలందరినీ రెన్యువల్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo