శనివారం 11 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 12:45:44

'తెలంగాణ' ఏర్పాటులో కీలక ఘట్టాలు..

 'తెలంగాణ' ఏర్పాటులో కీలక ఘట్టాలు..

హైదరాబాద్‌: నేటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తవుతోంది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ ప్రజల ఆంకాంక్ష నెరవేరింది. ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన సుదీర్ఘ పోరాటాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టాలు:

నవంబర్‌ 29, 2009: తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆమరణ దీక్ష ప్రారంభం

డిసెంబర్‌ 1, 2009 : కేసీఆర్‌ అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బంద్‌

డిసెంబర్‌ 2, 2009: కేసీఆర్‌కు మద్దతుగా అన్ని జిల్లాల్లో రిలే దీక్షలు ప్రారంభం. 

డిసెంబర్‌ 09, 2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన

డిసెంబర్‌ 23,2009: కేంద్ర హోంశాఖ తెలంగాణ అంశంలో డిసెంబర్‌ 9వ తేదీన చేసిన ప్రకటన సవరించుకుంటూ తెలంగాణ అంశంపై మరింత విస్తృత స్థాయిలో సంప్రదింపులు కొనసాగుతాయని చిదంబరం మరో ప్రకటన చేశారు. ఆరోగ్యం సహకరించకున్నా కేసీఆర్‌ హుటాహుటిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపి జేఏసీ ఏర్పాటు చేశారు. 

జేఏసీ తొలి సమావేశం..

డిసెంబర్‌ 24, 2009: కలింగభవన్‌లో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి జేఏసీ తొలి సమావేశం. 

జనవరి 5వ తేదీ 2010: సీమాంధ్రలో సమైక్య కృత్రిమ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో సమావేశం. 

జనవరి 28, 2010 రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి కమిటీ నియమిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి చదంబరం ప్రకటన.

ఫిబ్రవరి 2, 2010 కమిటీ సారథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ,  మరో నలుగురు సభ్యులు, కమిటీ విధివిధానాలు ఖరారు. 

డిసెంబర్‌ 30,2010 జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. నివేదికలో ఆరు పరిష్కారాలను సూచించింది. 

జనవరి 6, 2011: శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు తెలియజేసేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రెండో సారి అఖిలపక్ష సమావేశం. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు దూరంగా ఉన్నాయి. 

8 పార్టీలతో భేటీ..

మార్చ్‌ 10, 2011: మిలియన్‌ మార్చ్‌

సెప్టెంబర్‌ 13, 2011 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సకల జనుల సమ్మె ప్రారంభం. ఇది 42 రోజుల పాటు కొనసాగింది. 

డిసెంబర్‌ 28, 2012: కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన 8 పార్టీలతో భేటీ

జులై 12,2013: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ ఖరారుకు ఏర్పాటు చేసిన కోర్‌ కమిటీ సమావేశానికి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరు. 

టీడీపీ యూటర్న్..

జులై 31, 2013: ఢిల్లీలో యూపీఏ మిత్రపక్షాల సమావేశం. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం. 

అక్టోబర్‌ 3, 2013: సీడబ్ల్యూసీ నిర్ణయానికనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 

అక్టోబర్‌8, 2013 : రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రులతో జీఎంవో ఏర్పాటు.

2013 నవంబర్‌ 12, 13వ తేదీల్లో రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలతో జీఎంవో సమావేశం. అప్పటి వరకు తెలంగాణకు అనుకూలంగా ఉన్నామంటూ, లేఖ ఇచ్చామంటూ చెప్పిన టీడీపీ యూటర్న్‌. సమావేశానికి గైర్హాజరు. 

2013 డిసెంబర్‌ 12వ తేదీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రం రూపొందించిన బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయం సేకరించేందుకు రాష్ట్రపతి బిల్లు ప్రతులు అసెంబ్లీకి పంపారు. 

బిల్లుకు ఆమోదం. .

జనవరి 30వ తేదీ 2014: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తి, బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన తీర్మానానికి శాసనసభ ఆమోదం. 

ఫిబ్రవరి 13, 2014: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

ఫిబ్రవరి 18, 2014 : లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం. 

ఫిబ్రవరి 20, 2014: రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం. 

మార్చ్‌ 1వ తేదీ, 2014: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి, భారత రత్న  ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలిపిన రోజు.

మార్చ్‌ 4వ తేదీ 2014: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ప్రభుత్వ రాజముద్ర( గెజిట్‌)లో ప్రచురించిన రోజు..

జూన్‌ 2వ తేదీ 2014: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం.  


logo