మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:35:32

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: మహేశ్‌ కుటుంబసభ్యులు

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: మహేశ్‌ కుటుంబసభ్యులు

వేల్పూర్‌: తమ కుటుంబానికి ఆర్థికంగా, హార్థికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అమరజవాన్‌ మహేశ్‌ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. 26 ఏండ్ల చిన్నవయసులోనే దేశంకోసం ప్రాణాలర్పించిన మహేశ్‌ కుటుంబానికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పక్షాన రూ.50 లక్షల నగదు, ఒకరికి ఉద్యోగం, ఇంటిస్థలం ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మహేశ్‌ భార్య సుహాసిని, తల్లిదండ్రులు రాజుబాయి-గంగమల్లు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ప్రకటన తమకు కొండంత ధైర్యాన్నిచ్చిందన్నారు. తమ కుమారుడి మరణవార్త వచ్చినప్పటినుంచి అండగా నిలిచిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మహేశ్‌ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కోమన్‌పల్లి గ్రామస్థుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని సర్పంచ్‌ పత్రి రాజేశ్వర్‌, వైస్‌ ఎంపీపీ సురేశ్‌ పేర్కొన్నారు.