గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 01, 2020 , 16:05:44

సీఎంఆర్‌ఎఫ్‌కు మహేశ్‌ బ్యాంక్‌ రూ.50 లక్షలు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌కు మహేశ్‌ బ్యాంక్‌ రూ.50 లక్షలు అందజేత

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ రూ. 50 లక్షలను విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని బ్యాంక్‌ ప్రతినిధులు చెక్కు రూపంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కలిసి అందజేశారు. కరోనా వైరస్‌ నివారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల కోసం తమ వంతు చేయూతను అందిస్తున్నట్లు బ్యాంకు ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo