సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 21:31:55

పోలీస్ క్వార్ట‌ర్స్ పున‌రుద్ధ‌ర‌ణ‌.. మ‌హేష్ భ‌గ‌వ‌త్ ప్రారంభం

పోలీస్ క్వార్ట‌ర్స్ పున‌రుద్ధ‌ర‌ణ‌.. మ‌హేష్ భ‌గ‌వ‌త్ ప్రారంభం

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని మ‌ల్కాజ్‌గిరి డీసీపీ కార్యాల‌యానికి స‌మీపంలో పున‌రుద్ధ‌రించిన పాత పోలీస్ క్వార్ట‌ర్స్ భ‌వ‌నాన్ని అదేవిధంగా నేరెడ్‌మెట్‌లోని క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో ఆఫీస‌ర్స్ డైనింగ్ హాల్‌ను రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు సీపీ జి. సుధీర్‌బాబు పాల్గొన్నారు. రూ .20 లక్షల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా నూత‌న పార్కింగ్ ప్రాంతాన్ని, ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన మియావాకి తోట‌ల‌ను పోలీసు అధికారులు ప‌రిశీలించారు. పునరుద్ధరించిన క్వార్టర్స్‌లో పోలీసు దుకాణాలు, రిక్రూట్‌మెంట్ సెల్, క్లూస్ బృందానికి వసతి కల్పించ‌నున్న‌ట్లు కమిషనర్ తెలిపారు.
logo