శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 02:57:41

ఆసిఫాబాద్‌ జిల్లాలో డీజీపీ ఆకస్మిక పర్యటన

ఆసిఫాబాద్‌ జిల్లాలో డీజీపీ ఆకస్మిక పర్యటన

  • మావోయిస్టుల కదలికలపై మహేందర్‌రెడ్డి సమీక్ష

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. జిల్లాలోని తిర్యాణి అడవుల్లో ఇటీవల మావోయిస్టు నేత అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ తన బృం దంతో సంచరించినట్లు సమాచారం అందడంతో, పెద్ద సంఖ్యలో పోలీసులు అడవులను జల్లెడ పట్టారు. రెండుసార్లు ఎదురుపడినా త్రుటి లో తప్పించుకున్నాడు. కూంబింగ్‌లో భాగంగా లభించిన డంప్‌లో భాస్కర్‌కు సంబంధించిన డైరీ దొరకడంతో, మావోయిస్టులకు సహకరిస్తున్న కొంతమంది పేర్లు బయటపడగా.. వారికి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌ చేరుకున్న మహేందర్‌రెడ్డి కొద్దిసేపు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ఝా, రామగుండం సీపీ సత్యనారాయణ, ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణువారియర్‌తో జిల్లాలో మావోయిస్టుల కదలికలపై చర్చించారు. అనంతరం తిర్యాణి అడవులతోపాటు మహారాష్ట్రను ఆనుకొని ఉన్న ప్రాణహిత పరీవాహక ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.


logo