సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 02:08:59

మాతా మాణికేశ్వరికి కన్నీటి వీడ్కోలు

మాతా మాణికేశ్వరికి కన్నీటి వీడ్కోలు
  • అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
  • కర్ణాటక ప్రభుత్వం నిర్వహణ

నారాయణపేట ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మాతా మాణికేశ్వరికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక ప్రభుత్వం అధికార లాంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. మాతను చివరిసారి దర్శించుకొనేందుకు కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని యానగుంది సూర్యనందిక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మాణికేశ్వరిమాత ఈనెల 7న శివైక్యం పొందిన విషయం తెలిసిందే. రెండురోజులపాటు ఆమె పార్థివదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఉంచారు. మనరాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మాత గతంలో సజీవసమాధి కోసం ఏర్పాటుచేసుకున్న చోటే ఆమె పార్థివదేహాన్ని ఉంచారు. అంత్యక్రియలకు కర్ణాటకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. logo