బుధవారం 08 జూలై 2020
Telangana - Apr 21, 2020 , 22:35:02

రాజన్న ఆలయంలో మహాలింగార్చన

రాజన్న ఆలయంలో మహాలింగార్చన

వేములవాడ : మాస శివరాత్రిని పురస్కరించుకొని వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం రాత్రి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు మహాలింగార్చనను నిర్వహించారు. స్వామివారి నిత్యపూజలతో పాటు ఆలయ అద్దాల మండపంలో రాత్రి 365 జ్యోతులను లింగాకృతిలో పేర్చి శాస్ర్తోక్తంగా లింగార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ ఇన్‌సెక్టర్‌ రాజశేఖర్‌, పూజల ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
logo