గురువారం 28 మే 2020
Telangana - Apr 30, 2020 , 18:17:12

గ్రీన్‌జోన్‌లో మహబూబ్‌నగర్‌: శ్రీనివాస్‌ గౌడ్‌

గ్రీన్‌జోన్‌లో మహబూబ్‌నగర్‌: శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రీన్‌జోన్‌లో ఉన్నదని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించారు. అధికార యంత్రాంగం సహకారంతో నారాయణపేట కరోనా రహిత జిల్లాగా మారిందని, మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రీన్‌జోన్‌గా వచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో కొన్ని రోజులుగా కరోనా కేసులు లేవని, మరో ఆరు రోజుల్లో మహబూబ్‌ నగర్‌ కూడా కరోనా రహిత జిల్లాగా మారుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు, లాక్‌డౌన్‌ను పాటించాలని సూచించారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు బయట తిరిగితే దవాఖానకు తరలిస్తామని చెప్పారు.  

మహబూబ్‌నగర్‌ బియ్యాన్ని కేరళ, తమిళనాడుకు, మామిడి పండ్లను బ్రిటన్‌కు ఎగుమతి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న తెలంగాణ కూలీలకు ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి కనీస వసతి, నిత్యావరసరాలు అందేలా చూస్తున్నామని తెలిపారు. కరోనా తర్వాత కూడా ఇండ్లు లేనివారికి వసతి కల్పిస్తామని చెప్పారు.


logo