సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 20:28:01

మహబూబాబాద్‌ జిల్లా అభివృద్ధే లక్ష్యం : మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌ జిల్లా అభివృద్ధే లక్ష్యం : మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్ : జిల్లా సమగ్ర అభివృద్ధే మన లక్ష్యమని, ఇందుకోసం అధికారులంతా సమన్వయంతో, సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో మంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని, దీనికోసం మనమంతా సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.100 కోట్లు గిరిజన శాఖకు రానున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సర్పంచుల ద్వారా ప్రతిపాదనలు తీసుకుని నిధులు మంజూరు చేయించుకొని రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo