గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 21, 2020 , 09:00:42

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా శివరాత్రి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా శివరాత్రి వేడుకలు

హైదరాబాద్‌: శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతన్నాయి. ఓం నమఃశివాయ నామ స్వరణతో భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. రాజరాజేశ్వర స్వామివారి దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు బారులు తీరారు. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు మహాలఘుదర్శనం కల్పిస్తున్నారు. రాజరాజేశ్వరస్వామి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్ర్తాలు సమర్పించారు. సాయంత్రం నాలుగు గంటలకు శివదీక్ష పరులకు ప్రత్యేక దర్శనాలు కల్పించనున్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన పూజ చేయనున్నారు. రాత్రి 11:30 గంటలకు గర్భగుడిలో స్వామి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. 


logo