బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 20, 2020 , 21:51:58

రుద్రేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

రుద్రేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

వరంగల్ : వరంగల్‌లోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పాల్గొని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వర్తించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా ఈ మహాశివరాత్రి వేడుకలను భక్తులు మహావైభవంగా నిర్వహిస్తారని కాకతీయులు శైవ సంప్రదాయం పాటిస్తూ తెలంగాణ, ఆంధ్రా ప్రాంతం వరకు అనేక శైవక్షేత్రాలు నిర్మించారన్నారు. వరంగల్‌ నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారని, రుద్రేశ్వరుడి కృపతో ఎంతో మంది ఉన్నతస్థాయికి చేరుకుంటారన్నారు. ధార్మిక భావనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ అర్ధనారీశ్వరువై పరమశివునికి ప్రీతికరమైన శుక్రవారం మహాశివరాత్రి రావడం విశేషమన్నారు. శుక్రవారం రోజున మహాలక్ష్మీ ఉద్భవించిన మారేడు దళములతో అభిషేకాలు నిర్వహించడం వలన ఈశ్వరకటాక్షం లభిస్తుందన్నారు.logo