సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:22:14

అద్భుతంగా నాగోబా ఆలయ నిర్మాణం

అద్భుతంగా నాగోబా ఆలయ నిర్మాణం

  • మహాసభలో మెస్రం వంశీయుల వెల్లడి

ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని మెస్రం వంశీయులు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌ హాలులో పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌ పటేల్‌ అధ్యక్షతన ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మెస్రం వంశీయుల మహాసభ నిర్వహించారు. ముందుగా వారు నాగోబా ఆలయంలో సంప్రదాయ పూజలు చేశారు. కొత్తగా నిర్మిస్తున్న ఆలయ పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకు దాదాపు రూ.2.06 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. సేకరించిన నిధులు, ఖర్చుల వివరాలు, నాగోబా ఆలయ నిర్మాణం, జాతర నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.