హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పన్నుల ఉద్యోగుల సంఘం(TSTEA) అధ్యక్షుడిగా కె. మధుసూదన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ (ST) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఇతర ఆఫీస్ బేరర్లు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా స్టేట్ టాక్స్ ఆఫీసర్ కృష్ణ వర్ధన్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్గా అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టి) స్వర్ణ కుమార్ ఎంపికైనట్లు TSTEA గౌరవ అధ్యక్షులు టి.వెంకటేశ్వర్లు తెలిపారు.