గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:55:29

ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌

ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌

  • రూ.15 లక్షలు పోగొట్టుకొన్న యువకుడు
  • మనస్తాపంతో బలవన్మరణం

లక్షెట్టిపేట రూరల్‌: ఆన్‌లైన్‌ గేమ్‌ ఓ యువకుడి ప్రాణంతీసింది. కొద్ది రోజులుగా సెల్‌ఫోన్‌లో దఫాబెట్‌ ఆడుతూ రూ.15 లక్షల వరకు అప్పుచేసి.. చివరకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్‌-లక్ష్మిల  ఒక్కగానొక్క కొడుకు మధూకర్‌(24) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌ (ఈసీఈ) ఫైనలియర్‌ చదువుతున్నాడు. ఐదు నెలలుగా సెల్‌ఫోన్‌లో దఫాబెట్‌ గేమ్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలో రూ.15 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. విషయం తండ్రికి తెలియడంతో అప్పు తెచ్చి కట్టేశాడు. ఇంకోసారి అలాంటి గేమ్‌లు ఆడవద్దని నచ్చజెప్పాడు. అంతపెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడంతో మధూకర్‌ తీవ్ర మనస్తా పం చెందాడు. ఈ నెల 7న పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి మంచిర్యాలకు వెళ్లి పురుగుల మందు కొనుక్కొని శివారు ప్రాంతంలో తాగాడు. అనంతరం బంధువులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. వారు కుటుంబసభ్యులకు సమాచారమివ్వడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.  


logo