సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Aug 12, 2020 , 19:33:42

టిక్‌టాక్‌ను మ‌ర్చిపోలేకున్నారా? మీకు నేనున్నా అంటున్న హైద‌రాబాద్‌ 'హై స్టార్‌‌' యాప్

టిక్‌టాక్‌ను మ‌ర్చిపోలేకున్నారా?  మీకు నేనున్నా అంటున్న హైద‌రాబాద్‌ 'హై స్టార్‌‌' యాప్

టిక్‌టాక్‌ను బ్యాన్ చేసి రోజులు గ‌డుస్తున్నా ప్ర‌జ‌లు ఇంకా మ‌ర్చిపోలేక‌పోతున్నారు. టిక్‌టాక్ లేదంటూ బాధ ప‌డుతున్నారు. దీనికి ప్ర‌త్యామ్నాయంగా ఎన్ని యాప్స్ వ‌చ్చినా సంతృప్తి చెంద‌డం లేదు. అయితే టిక్‌టాక్‌‌ను మైమ‌ర‌పించే యాప్ ఉందంటూ హైద‌రాబాద్ నుంచి 'హై స్టార్' ముందుకొచ్చింది. ఇప్పుడు ఇది బాగా పాపుల‌ర్ అవుతుంది. ఇది టిక్‌టాక్‌ను మ‌రిపిస్తుంద‌ని న‌గారానికి చెందిన ప‌బ్బాస్ గ్రూప్ వెల్ల‌డించింది.

అయితే టిక్‌టాక్ కేవ‌లం 15 సెకండ్ల వ్య‌వ‌ధి ఉన్న యాప్స్‌నే అప్‌లోడ్ చేసే అవ‌కాశం ఉంది. కానీ హై స్టార్‌లో ఏకంగా 60 సెకండ్ల వీడియోల‌నే అప‌ల్‌లోడ్ చేయ‌వ‌చ్చు. న‌చ్చిన‌ట్లుగా వీడియో చేసి ఇత‌రుల‌కు పంప‌వ‌చ్చు. కామెడీ, పాట‌లు, ఆట‌లు, ఆహారం ఇలా ఏ కేట‌గిరికి సంబంధిన‌వైనా తీసుకోవ‌చ్చు. దీంట్లో క‌నుక పేరు ప్ర‌తిష్ట‌లు తెచ్చుకుంటే ఇత‌ర కంపెనీ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో ఉద్యోగం సంపాదించుకోవ‌చ్చు. దీనివ‌ల్ల సంపాద‌న కూడా పెరుగుతుంది. 


logo