బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 21:40:38

మాతా మాణికేశ్వరికి కన్నీటి వీడ్కోలు

మాతా మాణికేశ్వరికి కన్నీటి వీడ్కోలు

నారాయణ పేట : అశేష భక్త జన సందోహం  మధ్య సోమవారం యానగుంది సూర్యనంది క్షేత్రంలో మాతా మాణికేశ్వరి  అంతిమ సంస్కారాలు నిర్వహించారు. లక్షాలాది మంది భక్తుల హృదయాలలో ఆరాద్యదైవంగా నిలిచిన మాణికేశ్వరి మాత ఈ నెల 7న శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా పార్థీవ దేహాన్ని భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మాతను చివరి సారిగా దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత అంతిమ సంస్కారాలకు శ్రీకారం చుట్టారు. కర్ణాటక పోలీసులు గౌరవ వందనం సమర్పించడంతో సూర్యనంది క్షేత్ర కమిటీ సభ్యులు మాత అంతిమ కార్యక్రమాలను సంప్రదాయ రీతిలో ఆరంభించారు. మాత గతంలో సజీవ సమాది కోసం ఏర్పాటు చేసిన సమాదిలోనే పార్థీవదేహాన్ని ఉంచి అంతిమ కార్యక్రమాలను పూర్తిచేశారు.logo