ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 05, 2020 , 19:24:43

క‌రోనా టైంలో మా చాలెంజ్‌!

క‌రోనా టైంలో మా చాలెంజ్‌!

క‌రోనా టైంలో మా చాలెంజ్‌!

ఫొటో చాలెంజ్‌, బ‌కెట్ చాలెంజ్‌, గ్రీన్ చాలెంజ్‌.. ఇలా ఇదివ‌ర‌కు ఎన్నో చాలెంజ్‌లు చూశాం. కానీ స‌రికొత్త‌గా  క‌రోనా టైంలో మా చాలెంజ్ అని ప్రారంభించారు కొంద‌రు మిత్రులు. ఇంత‌కీ ఆచాలెంజ్ ఏంటంటే..

సోష‌ల్ మీడియా వేదిక‌గా కుమురం భీం జిల్లా పెంచిక‌ల్ పేట మండలానికి చెందిన మిత్రులు సరికొత్త చాలెంజ్ విసురుతున్నారు. లాక్‌డౌన్ టైంలో ప్ర‌తి ఒక్క‌రూ ఒక నిరుపేద కుటుంబం ఆక‌లి తీర్చేలా స‌హాయం చేయాల‌ని స‌వాల్ విసురుతున్నారు. పెంచిక‌ల్ పేట మండ‌లానికి చెందిన నాగ‌రాజు, మ‌జిత్‌, హ‌రికృష్ణ‌, ప్ర‌శాంత్‌, ర‌మేశ్‌, ప్ర‌సాద్‌, సంతోష్ నిరుపేద‌లకు త‌మ‌కు తోచిన సాయం చేస్తున్నారు. నూనె, ట‌మాటాలు, మిల్‌మేకర్‌, ఉల్లిగ‌డ్డ‌, ప‌ప్పులు, ప‌చ్చిమిర్చి, ఆలుగ‌డ్డ‌లు ప్యాక్ చేసి నిరుపేద కుటుంబాల‌కు అందిస్తున్నారు. వీరు స్వంత ఖ‌ర్చుతో ఈ స‌రుకులు అందిస్తూ మ‌రికొంత మందికి స‌వాల్ విసురుతున్నారు. వీరు చేస్తున్న కార్య‌క్ర‌మానికి స్థానికులంతా మెచ్చుకుంటున్నారు.


logo