శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Mar 01, 2020 , 01:58:44

జలమండలికి శివారు సివరేజి నిర్వహణ

జలమండలికి శివారు సివరేజి నిర్వహణ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జలమండలి బోర్డు సివరేజి నిర్వహణ సేవలు మరింత విస్తరించనున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మురుగునీటి నిర్వహణను చూస్తున్న జలమండలి.. ఆదివారం నుంచి శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఈ సేవలను ప్రారంభించనున్నదని జలమండలి ఎండీ ఎం దానకిశోర్‌ వెల్లడించారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి బోర్డు కార్యాలయంలో సివరేజి నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్‌ శివారు మున్సిపాలిటీల్లోని దాదాపు 4 లక్షల క్యాన్‌ (నల్లా) నంబర్లకు అనుసంధానమై ఉన్న ఫోన్‌నంబర్లకు వారంపాటు వాయిస్‌ మెసేజ్‌లను పంపించేందుకు ఏర్పాట్లుచేశామని తెలిపారు. సమావేశంలో జలమండలి ఈడీ ఎం సత్యనారాయణ, ఆపరేషన్స్‌ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పీ రవి, టెక్నికల్‌ డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. సివరేజి సమస్యల పరిష్కారానికి 155313 హెల్ప్‌లైన్‌ నంబర్‌ అందుబాటులో ఉన్నది.


logo