సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 21:58:27

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన గేయ రచయిత చంద్రబోస్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన గేయ రచయిత చంద్రబోస్‌

హైదరాబాద్‌ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి విసిరిన చాలెంజ్ స్వీకరించిన సినీ గేయ రచయిత చంద్రబోస్ శనివారం మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తాను వృక్షో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని నమ్ముతానని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ మంచి కార్యక్రమమని అన్నారు. జీవితం, సమాజం, భవిష్యత్ పచ్చగా ఉండాలంటే పచ్చని చెట్లే మూలాధారం అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్, ప్లేబ్యాక్ సింగర్ ఎం.ఎం.శ్రీలేఖ, సినీ దర్శకులు మున్నాకు చంద్రబోస్ చాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.


logo