శనివారం 11 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 01:43:32

లంపి స్కిన్‌ మనుషులకు సోకదు

లంపి స్కిన్‌ మనుషులకు సోకదు

-పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మారెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొన్ని జిల్లాల్లో గోజాతి పశువుల్లో పాక్స్‌ రకానికి చెందిన వైరస్‌తో లంపి స్కిన్‌ వ్యాధి (చర్మంపై బొబ్బలు) సోకుతున్నట్టు గుర్తించామని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మారెడ్డి తెలిపారు. ఇది పశువుల నుంచి మనుషులకు సోకదని స్పష్టంచేశారు. కొన్ని జిల్లాల్లో ఈ వ్యాధి వెలుగుచూసిన నేపథ్యంలో ఆదివారం పశుసంవర్ధకశాఖ కార్యాలయం నుంచి ఆయా జిల్లాల పశువైధ్యాధికారులతో లక్ష్మారెడ్డి పరిస్థితిని సమీక్షించారు. దీని నివారణకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నదని, త్వరలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్‌ చేయనున్నట్టు చెప్పారు.   


logo