శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 14:34:09

ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వు జారీ

ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వు జారీ

హైదరాబాద్‌ : నిన్న అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వును ప్రభుత్వం నేడు జారీ చేసింది. క్రమబద్దీకరణ ఛార్జీలకు తాజా మార్కెట్‌ విలువను కాకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువ ఆధారంగానే ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుంను వసూలు చేయనున్నారు. 2015 నాటి ఎల్‌ఆర్‌ఎస్‌ స్లాబ్‌లతో క్రమబద్దీకరణ రుసుంను వసూలు చేయనున్నారు. చదరపు గజం మార్కెట్‌ ధర 3 వేల వరకు ఉంటే 20 శాతం, రూ.3,001 నుంచి రూ. 5 వేల వరకు 30 శాతం, రూ. 5001 నుంచి రూ. 10 వేల వరకు 40 శాతం, రూ. 10,001 నుంచి రూ. 20 వేల వరకు 50 శాతం, రూ. 20,001 నుంచి రూ. 30 వేల వరకు 60 శాతం, రూ. 30,001 నుంచి రూ. 50 వేల వరకు 80 శాతం, రూ. 50 వేలకు పైగా మార్కెట్‌ ధర ఉంటే వందశాతం  క్రమబద్దీకరణ రుసుం వసూలు చేయనున్నారు. నాలా రుసుం కూడా క్రమబద్దీకరణ రుసుంలోనే ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.


logo