సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 06:45:27

రేపు బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

రేపు బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

హైద‌రాబాద్ : రాష్ర్టానికి మ‌ళ్లీ వాన‌ల బుగులు ప‌ట్టుకున్న‌ది. మ‌ధ్య బంగాళాఖాతంలో సోమ‌వారం అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. ఇది మంగ‌ళ‌వారం నాటికి మ‌రింత బ‌ల‌ప‌డొచ్చు. మ‌రోవైపు ద‌క్షిణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీరానికి ద‌గ్గ‌ర‌లో ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీట‌ర్ల ఎత్తువ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది. ఈ రెండింటి ప్ర‌భావంతో రాష్ర్టంలోని చాలా ప్రాంతాల్లో నాలుగు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని హైద‌రాబాద్ కేంద్రం డైరెక్ట‌ర్ నాగ‌ర‌త్న తెలిపారు. ఆదివారం మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు, సోమ‌వారం భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని చెప్పారు. ప్ర‌ధానంగా మంగ‌ళ‌, బుధవారాల్లో ద‌క్షిణ తెల‌లంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురువొచ్చ‌ని వెల్ల‌డించారు. వ‌ర్షాలు మ‌ళ్లీ పుంజుకోనున్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. లోత‌ట్టు ప్రాంతాల‌వారు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని పేర్కొన్నారు.


logo