శనివారం 06 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 23:43:45

తక్కువ ఖర్చుతో హెచ్‌సీయూ వెంటిలేటర్‌

తక్కువ ఖర్చుతో హెచ్‌సీయూ వెంటిలేటర్‌

కొండాపూర్‌: అత్యవసర సమయంలో రోగులకు సేవలందించేందుకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పూర్వ విద్యార్థులు తక్కువ ఖర్చుతో మెరుగైన వెంటిలేటర్‌ను రూపొందించినట్లు వర్సిటీ పీఆర్వో ఆశిశ్‌ వెల్లడించారు. హెచ్‌సీయూ స్కూల్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌ విద్యనభ్యసించిన వెంకటరాహుల్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంటెక్‌ పూర్తిచేసిన రజనీకాంత్‌.. కన్జర్విజన్‌ టెక్నాలజీస్‌తో కలిసి ఈ వెంటిలేటర్‌ను తయారు చేసినట్టు తెలిపారు.


logo