శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:21:21

ప్రేమ కోసం ప్రాణం తీసుకున్నారు

ప్రేమ కోసం ప్రాణం తీసుకున్నారు

  • పెండ్లికి పెద్దల తిరస్కారం.. పురుగులమందు తాగి ప్రేమికుల బలవన్మరణం

మేడిపల్లి: వారిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. పెద్దలను ఒప్పిం చి పెండ్లి చేసుకుందామనుకున్నారు. పైగా, కుటుం బబాధ్యతలు తెలిసినవాళ్లే. పనిచేస్తూ ఇంట్లోవాళ్లకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. కానీ, పెద్దలు వాళ్ల ప్రేమను కాదన్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ ప్రేమికులు.. పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న బోరెంకల్‌ కిరణ్‌కుమార్‌ కూతురు శ్రావణి (23) స్థానిక బిగ్‌బజార్‌లో సేల్స్‌ ఉమన్‌గా పనిచేస్తున్నది. వరంగల్‌ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండకు చెందిన తుమ్మల చంద్రయ్య కుమారుడు అజయ్‌ ఉప్పల్‌లోని బజా జ్‌ వెహికిల్‌ షోరూంలో సూపర్‌వైజర్‌. రెండేండ్ల క్రితం ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది.  పెండ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకొని పెద్దలకు ప్రేమ విషయం చెప్పారు. 

శ్రావణి తల్లిదండ్రులు అంగీ కరించినా .. అజయ్‌ తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారిద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం మేడిపల్లిలోని ఓయో లాడ్జిలో గదిఅద్దెకు తీసుకొన్నారు. అప్పటికే కొనుక్కొన్న పురుగులమందు తాగారు.  బుధవారం హోటల్‌ సిబ్బంది గది డోర్‌ తట్టగా అపస్మారక స్థితిలో ఉన్న అజయ్‌ డోర్‌ తీసి కిందపడ్డాడు. అప్పటికే శ్రావణి మృతిచెందింది. అజయ్‌ను స్థానిక దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.logo