శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:02:16

ఉద్యోగుల భద్రతకు చర్యలు

ఉద్యోగుల భద్రతకు చర్యలు

  • శ్రీశైలం తరహా దుర్ఘటనలు నివారిస్తాం..
  • ధైర్యంగా, బాధ్యతగా విధులు నిర్వర్తించండి
  • జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌/శ్రీశైలం నమస్తే తెలంగాణ: విద్యుత్‌ ఉద్యోగుల భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేసి, తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సీఎండీ పిలుపునిచ్చారు. ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రభాకర్‌రావు బుధవారం పరిశీలించారు. సర్వీస్‌బే, ఆరు యూనిట్లు జనరేటర్లు, కంట్రోల్‌ ప్యానెళ్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇండోర్‌ గ్యాస్‌ సబ్‌స్టేషన్‌, మెయిన్‌ కంట్రోల్‌ రూమ్‌లను పరిశీలించారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి నేతృత్వంలోని బృందంతోనూ చర్చించారు. అనంతరం శ్రీశైలం ప్లాంటులో విధులు నిర్వహిస్తున్న దాదాపు 200 మంది సిబ్బందితో సీఎండీ ప్రభాకర్‌రావు సమావేశమయ్యారు. 

గుండెనిబ్బరంతో పనిచేయాలి 

తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్‌ ఉద్యోగులు యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించే ఎన్నో అద్భుత విజయాలు సాధించారని సీఎండీ కొనియాడారు. ‘అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది. సహచర ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. తోటివారు మరణించినప్పుడు కొంత అభద్రతాభావం నెలకొంటుం ది. నేనూ ఎంతో బాధపడుతున్నాను. ఇలాంటి సమయంలోనే మరింత పట్టుదలతో, గుండె నిబ్బరంతో పనిచేయాలి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని ప్రభాకర్‌రావు ఉద్యోగుల్లో ఆత్మైస్థెర్యం నింపారు.  4వ యూని ట్‌ పూర్తిగా దగ్ధం కావడంతో అక్కడ నష్టం ఎక్కువగా ఉందని.. 1, 2 యూనిట్లు బాగానే ఉన్నాయని, ఐదో యూనిట్‌కూడా బాగానే ఉందని, ఆరో యూనిట్‌లో ప్యానెళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. త్వరలోనే విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ఆయన వెంట జెన్‌కో డైరెక్టర్లు వెంకట్రాజం, అజయ్‌, సీఈలు ప్రభాకర్‌రావు, సురేశ్‌ తదితరులు ఉన్నారు.

పంప్‌హౌస్‌ల నిర్వహణకు 

పకడ్బందీ చర్యలు : రజత్‌కుమార్‌

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై జలవనరులశాఖ పకడ్బందీ ప్రణాళిక సిద్ధంచేస్తున్నది. రాష్ట్ర జలవనరులశాఖ ము ఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ బుధవారం జలసౌధలో ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షిం చారు.  ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భద్రతా ఏర్పాట్లపై లోతుగా చర్చించారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం సొరంగంలో ఉన్నట్టుగా రాష్ట్రంలోని పలు ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలోనూ అండర్‌గ్రౌండ్‌ పంప్‌హౌస్‌లు ఉన్నా యి. కాళేశ్వరం, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ తదితర ప్రాజెక్టుల పరిధిలో భూగర్భంలో పంప్‌హౌస్‌ల నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనూ భూగర్భంలోని పంప్‌హౌస్‌ల నుంచి కూడా విజయవంతంగా జలాల్ని ఎత్తిపోస్తున్నారు. కాగా, శాఖ పరిధిలో నైపుణ్యం ఉన్న ఇంజినీర్లతో మరోసారి  పునః పరిశీలన చేయించాలని భావిస్తున్నారు. అలాగే ఇతర శాఖలకు చెందిన నిపుణులను కమిటీలో నియమించి భద్రతా ప్రమాణాలను పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని భావిసు

్తన్నారు. అవసరమైతే థర్డ్‌ పార్టీతో కూడా భద్రతా ప్రమాణాల్ని పునః పరిశీలించే యోచనలో ఉన్నట్టు ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. 

నష్టం 100 కోట్ల లోపే?

  • శ్రీశైలం ప్రమాదంపై ప్రాథమిక అంచనా!

శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదంలో వేల కోట్ల నష్టం ఉంటుందన్న వదంతులు నీటి బుడగల్లా తేలిపోనున్నాయి. అంతర్గత విచారణ మేరకు నష్టం రూ.100 కోట్లలోపే ఉం టుందని నిపుణులు భావిస్తున్నారు. మూ ణ్నాలుగు రోజులుగా సాగుతున్న విచారణలో 4వ యూనిట్‌కు ఎక్కువగా నష్టం వాటిల్లినట్టు అందరూ చెప్తున్నారు. అలాగే జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఇప్పటికే ప్రకటించినట్టుగా.. ఒకటి, రెండో యూనిట్లు బాగా ఉన్నాయని, చిన్న చిన్న సాంకేతిక అంశాలను సరిదిద్ది వచ్చేనెల 15 నాటికి పునరుద్ధరించనున్నారు. ఇక మూడో, ఐదో, ఆరవ యూనిట్లలో జరిగిన స్వల్ప నష్టాన్ని అంచనా వేసి.. వాటినికూడా నెల రోజుల్లో సిద్ధం చేయవచ్చనే నమ్మకం నిపుణుల్లో వ్యక్తమవుతున్నది. నాలుగో యూనిట్‌ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. 

పుట్టెడు దుఃఖంలో..

ఆయన వయసు 73 ఏండ్లు. ఒకవైపు సొంత తమ్ముడు చనిపోయిన విషాదం. అంత్యక్రియల్లో పాల్గొని 24 గంటలు కూడా గడవలేదు. అయినా తన విద్యుక్తధర్మానికే కట్టుబడ్డారు. సామాజిక బాధ్యతను మర్చిపోలేదు. తన జీవితాన్ని విద్యుత్‌రంగానికే అంకితం చేసిన జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌.. దుఃఖాన్ని దిగమింగుకుని బుధవారం శ్రీశైలం ప్లాంటు సందర్శనకు వచ్చారు. ఉద్యోగులకు ధైర్యం చెప్పారు. ప్లాంటు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలను సోమవారం పరామర్శించి,  భరోసాను ఇస్తున్న సమయంలోనే తన తమ్ముడు శ్రీనివాసరావు మృతిచెందారన్న దుర్వార్త ప్రభాకర్‌రావుకు అందింది. వెంటనే వరంగల్‌ వెళ్లి, మంగళవారం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పవర్‌ ప్లాంటులో దుర్ఘటనపై విచారణ, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణ తదితర పనులను పర్యవేక్షించే కార్యక్రమం అప్పటికే ఖరారయ్యింది. దీనితో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని, బుధవారం సీఎండీ ప్రభాకర్‌రావు శ్రీశైలంలో పర్యటించారు.  


logo