మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 07:15:00

మృత్యువులా దూసుకొచ్చిన లారీ.. యువతీయువకుడు దుర్మరణం

మృత్యువులా దూసుకొచ్చిన లారీ.. యువతీయువకుడు దుర్మరణం

హైదరాబాద్‌ : మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. బైక్‌పై యువతీయువకుడు బీహెచ్‌ఈఎల్‌ వైపు నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్నారు. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మదీనాగూడ వద్దకు రాగానే బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. బైక్‌ ఎగిరిపడటంతో ఇద్దరికి తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే యువతి ప్రాణాలు కోల్పోయింది. యువకుడిని దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. లారీ  అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo